టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి కూలీల మృతి

May 16, 2026 - 21:58
 0  17
టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి కూలీల మృతి

టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి కూలీల మృతి

కాకినాడ మే 16, (వెలుగు నాడు ప్రతినిధి) : కాకినాడ,జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోవూరు బ్రిడ్జి వద్ద శనివారం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.రోడ్డు దాటుతున్న కూలీలను.టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఉపాధి హామీ పనుల నిమిత్తం కూలీలు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ లారీ వారిపైకి దూసుకెళ్లింది. లారీ వేగాన్ని నియంత్రించలేకపోవడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన కూలీలు.. సత్యవతి, కృష్ణమ్మ, చిట్టెమ్మ, అన్నవరం‌గా గుర్తించారు. వీరంతా స్థానిక చీడిగ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు.క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)కి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్