ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు సంచారపు వైద్య సేవలకు శ్రీకారం
ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు సంచారపు వైద్య సేవలకు శ్రీకారం
సంచారపు ఆరోగ్య సేవ వాహనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, జనవరి 21, (వెలుగునాడు ప్రతినిధి) : పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో సంచారపు. ఆరోగ్య ఆరోగ్య సేవ వాహనాన్ని బుధవారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు కూటమి నేతలతో కలిసి ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్‌ను, సంచారపు పశు ఆరోగ్య సేవ వాహనం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంచారపు ఆరోగ్య సేవ వాహనాన్ని జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.తంగిరాల సౌమ్య మాట్లాడుతూ..పశుపోషణ రైతుల జీవనాధారమని, పశువుల ఆరోగ్యం కాపాడితేనే రైతుల ఆర్థిక భద్రత సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకులకు సులభంగా, ఉచితంగా వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. సంచారపు ఆరోగ్య సేవ వాహనం ద్వారా గ్రామ గ్రామానికి వెళ్లి పశువులకు పరీక్షలు, చికిత్సలు, టీకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ చర్యలను అభినందించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0