అనుమంచిపల్లిలో ఉచిత వైద్య శిబిరం
అనుమంచిపల్లిలో ఉచిత వైద్య శిబిరం
జగ్గయ్యపేట ఫిబ్రవరి 05 (వెలుగు నాడు ప్రతినిధి) : జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు దశరథ జనార్ధన్ ఆధ్వర్యంలో మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేషమైన స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో 790మంది వైద్య సేవలు పొందారు.వారిలో నేత్ర వైద్య శిబిరంలో 362 మంది కంటి పరీక్షలు జరిపారు.238 మందికి కళ్ళజోడులను ఉచితంగా అందజేస్తారు.కంటి ఆపరేషన్ అవసరమైన వారికి విజయవాడలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు.బీపీ, షుగర్ ఉన్నవాళ్లకి ఉచితంగా మందులు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరాం, శిబిర కోఆర్డినేటర్ కట్టా వెంకట నరసింహారావు, కృష్ణా ఫార్మర్స్ సొసైటీ అధ్యక్షులు యానాల గోపీచంద్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అప్పన రమణయ్య, జిల్లా అంగన్వాడి కార్యదర్శి గద్దె రాజ్యలక్ష్మి, గ్రామ పార్టీ అధ్యక్షులు బొలిగొర్ల కోటేశ్వరరావు, చెరుకూరి లవయ్య ,వైకుంఠపు నవీన్,సర్పంచ్ పానుగంటి లక్ష్మీ త్రివేణి , చంద్రశేఖర్, తక్కేల్ల పాడు సర్పంచ్ కస్కుర్తి శ్రీనివాసరావు, బలబద్రు గురు ప్రసాద్, ఇంటూరి రఘు, షేక్ అక్బర్ వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.సచివాలయ సిబ్బంది ,వివోఏలు, ఏఎన్ఎంలు, ఎంఎల్ హెచ్పి లు ఆశ వర్కర్లు, ఫౌండేషన్ వాలంటీర్లు ఈ వైద్య శిబిరానికి సేవలు అందించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0