మొక్కజొన్న రైతులకు దన్నుగా ప్రభుత్వం
మొక్కజొన్న రైతులకు దన్నుగా ప్రభుత్వం
మ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట మార్చి17 (వెలుగు నాడు ప్రతినిధి) : మొక్క జొన్న రైతులకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) భరోసా ఇచ్చారు.జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం, మంగొల్లు గ్రామంలో మంగళవారం మొక్కజొన్న పంట పొలాలను ఎమ్మెల్యే తాతయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పరిశీలించారు.ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.మొక్కజొన్న పంటకు మార్కెట్లో కేవలం రూ 1700 ధర మాత్రమే లభిస్తున్నదని ఈ పరిస్థితుల్లో తమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయని ఎమ్మెల్యేకు రైతులు విన్నవించారు. ఈ సమస్యపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడుతో ఎమ్మెల్యే అక్కడికక్కడే ఫోన్‌లో మాట్లాడారు.జగ్గయ్యపేట నియోజకవర్గంలో సుమారు 17 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై స్పందించిన మంత్రి ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా రైతుల నుంచి ఇదే డిమాండ్ వస్తోందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీ కెనాల్ వైస్ చైర్మన్ మన్నె నారాయణరావు,మంగొల్లు సొసైటీ చైర్మన్ బొల్లం పురుషోత్తం,మాజీ సర్పంచ్ కాకనబోయిన పాండురంగారావు,వడ్డంపుడి అచ్చయ్య,రైతులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0