హోం మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు గుడివాడ అమర్‌నాథ్ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 

Jun 16, 2026 - 22:48
 0  5
హోం మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు గుడివాడ అమర్‌నాథ్ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 

హోం మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు గుడివాడ అమర్‌నాథ్ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 

మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను సహించబోము – ‘సే సారీ గుడివాడ’ నినాదాలతో నిరసన, జగన్‌తో పాటు అమర్‌నాథ్ బాధ్యత వహించాలని డిమాండ్

నందిగామ జూన్ 16,)వెలుగు నాడు ప్రతినిధి) : నందిగామ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్రంగా ఖండించారు. నందిగామలోని తన కార్యాలయంలో కూటమి నాయకులు, మహిళా నాయకులతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్‌నాథ్ ఫోటోపై కోడిగుడ్లు కొట్టి నిరసన వ్యక్తం చేసిన మహిళా నాయకులు, “సే సారీ గుడివాడ” అంటూ నినాదాలు చేశారు. మహిళల పట్ల అవమానకరమైన భాషను ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చుగానీ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.హోం మంత్రి వంగలపూడి అనిత గారు రాష్ట్ర ప్రజల భద్రత కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తున్న సమయంలో ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. గుడివాడ అమర్‌నాథ్ తన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, అలాగే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.తెలుగుదేశం పార్టీ మహిళల గౌరవం, మర్యాదల పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, మహిళలను కించపరిచే రాజకీయ సంస్కృతిని ఏ పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోదని ఆమె స్పష్టం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలపై సమాజం మొత్తం స్పందించాలని, ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవమే ప్రధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్