ఆదివాసి ప్రాంతాల బిడ్డలకు అండగా లిటిల్ ప్లాంట్ స్పెషల్ చిల్డ్రన్ ట్రస్ట్ చైర్మన్ గుమ్మడం శివసాగర్
ఆదివాసి ప్రాంతాల బిడ్డలకు అండగా లిటిల్ ప్లాంట్ స్పెషల్ చిల్డ్రన్ ట్రస్ట్ చైర్మన్ గుమ్మడం శివసాగర్
పాలమూరు, ఫిబ్రవరి 07,( వెలుగు నాడు ప్రతినిధి) : ఫీబ్రవరి 4, 5, 6 తేదీలలో పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కళాశాల సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ విద్యార్థులు అమ్రాబాద్ మండలం కొల్లంపెంట, కొమ్మనపెంట ఆదివాసి ప్రాంతాలలో క్యాంప్ నిర్వహించారు. లిటిల్ ప్లాంట్ స్పెషల్ చిల్డ్రన్ ట్రస్ట్ చైర్మన్ గుమ్మడం శివసాగర్ ఆదివాసి ప్రాంతాలలో నివసిస్తున్న 60 కుటుంబాలకు దుప్పట్లను,11రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.లిటిల్ ప్లాంట్ స్పెషల్ చిల్డ్రన్ ట్రస్ట్ చైర్మన్ గుమ్మడం శివసాగర్ సేవలు నిరంతరం నిరుపేద ఆదివాసి ప్రాంతాల బిడ్డల మీద చూపడం, వారు చేసిన సహకారం మరువలేమని ఏం ఎస్ డబ్లూ డిపార్ట్మెంట్ ఎచ్ ఓ డి ప్రొఫెసర్లు వెంకటేశం, దేవరాజ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్ననూరు అమ్రబాద్ సర్పంచులు కోటయ్య, రాజారాం నాయక్ , డిపార్ట్మెంట్ విద్యార్థులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0