అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు

Jan 25, 2026 - 00:40
 0  13
అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు

జగ్గయ్యపేట, జనవరి24 ( వెలుగు నాడు ప్రతినిధి ) : ఐసిడిఎస్ ప్రాజెక్టు చిల్లకల్లు ప్రాజెక్టు సిడిపిఓ సత్యవాణి ఆధ్వర్యంలో పట్టణంలో బాలికల మరియు బాలుర హైస్కూల్స్ లో శనివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉజ్వల భవిష్యత్తుకు బాలికలను శక్తివంతం చేద్దాం అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో సిడిపిఓ మాట్లాడుతూ బాలల హక్కులు,ఎడ్యుకేషన్, పౌష్టికాహారం, బాల్యవివాహా నిషేధచట్టం మరియు చైల్డ్ హెల్ప్ లైన్-1098 గురించి వివరించారు.ఈ సందర్భంగా బాలికలకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం బాల్యవివాహ నిషేధ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాల్లో బాలికల మరియు బాలుర హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మాధవిలత, నాగేశ్వరరావు,ఐసిడిఎస్ సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి, సువర్ణ, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్