కవిరాజుకు అక్షర ప్రవీణ పురస్కారం
కవిరాజుకు అక్షర ప్రవీణ పురస్కారం
జగ్గయ్యపేట, జనవరి22( వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేటకు చెందిన ప్రముఖ కవి సరికొండ నరసింహ రాజు (కవిరాజు ) ప్రతిష్టాత్మకమైన అక్షర ప్రవీణ పురస్కారం పొందారు.బుధవారం రాత్రి విజయవాడ గాంధీనగర్ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో శ్రీ శ్రీ కళావేదిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య సభలో తెలుగు సాహిత్యంలో కవిరాజు చేసిన విశేషమైన కృషికిగాను అతిధుల చేతులమీదుగా అక్షర ప్రవీణ బిరుదుతో పురస్కారం అందుకున్నారు.సరికొండ నరసింహ రాజు ఇప్పటివరకు వివిధ ప్రక్రియలలో12 పుస్తకాలు రచించారు.ముఖ్యమంత్రి చేతుల మీదగా రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారం పొందారు.ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సాహిత్యవేత్త కత్తిమండ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ సరికొండ కవిగా సాహిత్య వేత్తగా అన్ని సాహిత్య ప్రక్రియలలో విశేషమైన కృషిచేసారని అన్నారు ఈ కార్య క్రమాన్ని జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత సరికొండకు శ్రీకళావేదిక సంస్థ జగ్గయ్యపేట తరపున కళాకారులు సాహిత్య వేత్తలు అభినందనలు తెలియజేసారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0