బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్.

Feb 8, 2026 - 22:06
 0  4
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్.

సిద్దిపేట,ఫిబ్రవరి 08, ( వెలుగు నాడు ప్రతినిధి ) : బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై సిద్దిపేట పోలీస్ శాఖ ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటివరకు కేవలం జరిమానా మాత్రమే విధించేవారు కానీ ఇకపై ఈ పెట్టీ కేసుల్లో కూడా జైలు శిక్ష విధించబడుతుందని తెలియజేయడమైనది. మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించడం గొడవలు చేయడం లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై కేసులు నమోదు చేయబడతాయి. జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ప్రజలు సహకరించాలి. ఎక్కడైనా బహిరంగ మద్యపానం జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించవలసిందిగా కోరడమైనది.సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్