వాసవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే తాతయ్య

Jan 21, 2026 - 01:14
 0  3
వాసవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే తాతయ్య

వాసవీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే తాతయ్య

జగ్గయ్యపేట, జనవరి20, ( వెలుగు నాడు ప్రతినిధి ) : వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా,మంగళవారం వత్సవాయి గ్రామంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు స్త్రీల ఆత్మగౌరవానికి, త్యాగానికి, ధైర్యానికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచారని, సమాజంలో నైతిక విలువలు,స్త్రీ గౌరవం పరిరక్షణకు వాసవి అమ్మవారి జీవితం ఆదర్శప్రాయమని అన్నారు.అమ్మవారి దివ్య ఆశీస్సులు జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలందరిపై ఉండి, అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు,ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు బొగ్గవరపు వెంకటరాజ,వత్సవాయి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనతాల రామకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు,వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్