తిరువూరు నియోజకవర్గంలో రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాసరావు
తిరువూరు నియోజకవర్గంలో రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాసరావు
త్వరలో పరిష్కరిస్తానని ప్రజలకు హామీ
ఎన్టీఆర్ బ్యూరో ఫిబ్రవరి 10 (వెలుగునాడు) జిల్లా పరిధిలోని,తిరువూరు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ప్రజల ఆవేదన మరోసారి బయటపడింది. గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును కలిసి,గ్రామంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమై అభివృద్ధి మాటలు అర్థం లేనివిగా మారాయని వినతిపత్రం అందజేశారు.ఎమ్మెల్యే నియోజకవర్గంలో మూడు రోజులపాటు 35 గ్రామాలు పర్యటించిన సమయంలో కేవలం ఆయనే గమనించినదే కాకుండా, ప్రజలే స్వయంగా ముందుకొచ్చి తమ గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆయన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. లక్ష్మీపురం, రాయుగూడెం, కోకిలంపాడు, తిరువూరు, పీటీ కొత్తూరు, చింతలపాడు, కొమ్మిరెడ్డిపల్లి, వావిలాల, ఊటుకూరు, సత్యాలపాడు, విస్సన్నపేట తదితర గ్రామాల్లో రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్లు అధ్వానంగా ఉండటంతో అనారోగ్యంతో ఉన్నవారు,గర్భిణీలు ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, కొన్ని గ్రామాలకు ఆటోలు కూడా రావడం లేదని మహిళలు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఆర్లపాడు గ్రామంలో గత 22 ఏళ్లుగా రోడ్డు సమస్య అలాగే కొనసాగుతుండటం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామ నాయకులు విమర్శించారు.ఈ సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే, తిరువూరు నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని ఇకపై సహించబోమని స్పష్టం చేశారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రోడ్లు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి, పెండింగ్ రోడ్లన్నింటికీ నిధులు మంజూరు చేయించి కూటమి ప్రభుత్వ సహకారంతో శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0