పశు వైద్య శిబిర్యాలను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

Jan 20, 2026 - 00:44
 0  9
పశు వైద్య శిబిర్యాలను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

  ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట, జనవరి19, (వెలుగు నాడు ప్రతినిధి) : కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పశుపోషణ, గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడిన రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అన్నారు.జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరాల ద్వారా పశువైద్యులు నేరుగా రైతుల వద్దకే వెళ్లి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు ఉచితంగా వైద్య సేవలు, టీకాలు, అవసరమైన మందులు అందిస్తున్నారని పశుపోషణ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు ఈ అవకాశాన్నివినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నితిన్,ఏడి డాక్టర్ సత్యప్రసాద్ ,డాక్టర్ ఉదయ్ శంకర్,,యంగ్ ప్రొఫెషనల్ నరేష్ మొబైల్ వాన్ డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్