మండల పరిషత్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

Feb 13, 2026 - 22:00
 0  20
మండల పరిషత్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

మండల పరిషత్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

తిరువూరు ఫిబ్రవరి 13 (వెలుగు నాడు ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి వార్షికోత్సవ వేడుకలు దోహద పడతాయని,ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయ సిబ్బంది కృషి చేయాలని, అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు సూచించారు. మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల, కోడూరులోఘనంగా జరిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు గ్రామ పెద్దలు, అధికారులు హాజరై మాట్లాడారు. అనంతరం విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో సభికులని అలరించారు. కార్యక్రమంలో క్లస్టర్ చైర్మన్ జె. అదిశేషు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. రాం ప్రదీప్, కోడూరు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు డి. శరత్ బాబు, గ్రామ సర్పంచ్ టీ.సురేష్, గ్రామ పెద్దలు వై. చంద్రం, కె. నాగేశ్వరావు,పాఠశాల సిబ్బంది బి. నాగేంద్ర రావు, వి. తేజస్విని, వి. జయశ్రీ, టీ. సుప్రియ మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 1
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్