అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేసిన మున్సిపల్ వర్కర్లు
అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేసిన మున్సిపల్ వర్కర్లు.
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 07 (వెలుగు నాడు ప్రతినిధి ) మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం పట్టణంలోని స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ను ఆయన స్వగృహంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఫెడరేషన్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్లు కలసి వినతి పత్రం అందజేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రస్తావించడం ద్వారా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సిఐటియు మండల గౌరవ అధ్యక్షురాలు సోమోజు నాగమణి మాట్లాడుతూ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలలో మున్సిపల్ ఉద్యోగులు, మున్సిపల్ వర్కర్లు 55 వేల మంది పనిచేస్తున్నారని, ప్రజారోగ్యం, పర్యావరణం కాపాడటానికి వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎండనక, వాననక ప్రజల కోసం పనిచేస్తున్నారని, కాబట్టి 12వ పిఆర్సిని వెంటనే ప్రకటించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గత సమ్మె కాలపు ఒప్పందాల అమలకు జీవోను జారీ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం, ఎక్స్గ్రేషియో పెంపు, సంక్షేమ పథకాల అమలకు జీవో జారీ చేయాలని, పదవి విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, గ్రాడ్యూటీ చెల్లించాలని తదితర డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె రవికుమార్, కె వెంకటేశ్వరరావు, మున్సిపల్ వర్కర్లు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0