నకిలీ రిజిస్ట్రేషన్ లపై ప్రభుత్వం ఫోకస్ పెడుతుందా?

Jan 14, 2026 - 05:58
 0  2
నకిలీ రిజిస్ట్రేషన్ లపై ప్రభుత్వం ఫోకస్ పెడుతుందా?

నకిలీ పత్రాల సృష్టికి కేరాప్ గా కంచికచర్ల విజయవాడ

దస్తావేజు రైటర్ లే నకిలీ పత్రాల సృష్టికర్తలా?

ఎన్టీఆర్ జిల్లా బ్యూరో జనవరి 13, (వెలుగు నాడు న్యూస్ )

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని,కంచికచర్ల,
వీరులపాడు మండలాల్లోని కంచికచర్ల, పరిటాల, జుజ్జూరు, జగన్నాధపురం, పొన్నవరం గ్రామాలపరిధిలో దొంగ పత్రాలు సృష్టించి పంచాయతీ కామన్ సైట్ లను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు వినికిడి.నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు  సృష్టించడంతో కుటుంబాల్లో వివాదాలు నెలకొంటున్నాయి.కంచికచర్లలో  రాజమండ్రి రీజినల్ డైరెక్టర్ నుండి డిటిసిపి అనుమతులు ఉన్న లే అవుట్ ఉంది.ప్రస్తుతం కంచికచర్ల ప్రాంతం సి ఆర్ డి ఏ పరిధిలో ఉంది.దీంతో ఇక్కడ ఉన్న స్థలాలకు ఒక్క సారి గా రెక్కలోచ్చాయి. దీన్ని ఆసరా చేసుకున్న అక్రమార్కులు  దొంగ రిజిస్ట్రేషన్లకు తెరలేపుతున్నారు.విజయవాడ కొత్త వంతెన ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ప్రత్యేక ఆఫీసు పెట్టి  నకిలీ పత్రాలను సృష్టిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నట్లు సమాచారం
ప్రసాద్ తో పాటు కంచికచర్ల చెందిన మరి కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ తంతు నడుపుతున్నట్టు తెలుస్తుంది.ఈ బ్రోకర్ ల మాయాజలంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది..మనిషి జీవించి ఉన్నా, మరణ ధ్రువీకరణ పత్రాలు  సృష్టించడంతో  వివాదాలు ప్రారంభమవుతున్నాయి.మరణ ధ్రువీకరణ పత్రాలు తయారుచేసి రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.లక్షల్లో ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.దీనికి రిజిస్టర్ కార్యాలయంలో కొందరు సిబ్బందే ప్రధాన సూత్రదారులంటూ బహిరంగ విమర్శలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.దొంగ పత్రాలు సృష్టించడంలో కంచికచర్లలోని కొందరు దళారులు లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు నెలకొన్నాయి.నకిలీ పత్రాల రిజిస్ట్రేషన్ లతో కోర్ట్ లను  ఆశ్రయిస్తూ లక్షలాది రూపాయలు వినియోగదారులు పోగొట్టుకుంటున్నారు. కొనుగోలు దారులు.స్థానికంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయలలో కొందరు సిబ్బందికీ ఇలాంటి విషయాలు తెలుస్తాయనే కారణంతో గుట్టు చప్పుడు కాకుండా విజయవాడ తోపాటు రాష్టం లోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నారు. ప్రభుత్వ, పంచాయతీ స్థలాలు, పార్కులు, వాటర్ ట్యాంకులకు ఉపయోగించే స్థలాలను  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేపిస్తూ కోట్లు గడిస్తున్న ఆ దస్తావేజు విలేకరులపై చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలకు వెల్లు వేత్తుతున్నాయి.గ్రామపంచాయతీ అధికారులకు ఈ విషయాలు తెలిసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. కంచికచర్ల పరిధిలో ఒకే స్థలాన్ని ఇద్దరు,ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి.స్థలాలు ఉన్నట్లు చూపి గతంలో రిజిస్ట్రేషన్లు చేయించడంతో విజయవాడ, హైదరాబాదుకు చెందిన పలువురు లక్షల్లో నష్టపోవాల్సి వచ్చింది.నకిలీ పత్రాల సృష్టికర్తలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమ రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయడమే కాకుండా నకిలీ పత్రాలు సృష్టించే వారిపై రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా ప్రాంత వాసులతో పాటు కంచికచర్ల వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్