గోరంత దీపాలు-కొండంత వెలుగులు చిన్నారుల పెద్ద సాయం

Jan 14, 2026 - 05:58
 0  2
గోరంత దీపాలు-కొండంత వెలుగులు     చిన్నారుల పెద్ద సాయం

తిరువూరు జనవరి 13( వెలుగు నాడు న్యూస్) :   తిరువూరు బైపాస్ రోడ్‌లోని సూర్యా రెస్టారెంట్ సమీపంలో గల పరిపూర్ణ బాలల ఆశ్రమంలో గురువారం హృదయాన్ని హత్తుకునే దృశ్యానికి వేదిక అయింది. గంపలగూడెం జీవీ అకాడమీ స్కూల్ విద్యార్థులు తమ చిన్నచిన్న పాకెట్ మనీతో కూడబెట్టిన ప్రేమను బట్టల రూపంలో ఆశ్రమంలోని చిన్నారులకు అందించారు.
చిన్న వయసులోనే ఇతరులకు చేయూత అందించే ఆలోచన కలగడం ఎంతో గొప్ప విషయం. పిల్లల చేతుల ద్వారా వచ్చిన ఈ బహుమతుల్లో ప్రేమ ఉంది, పరమార్థం ఉంది, పరోపకార భావం ఉంది.ఈ సేవా కార్యక్రమం వెనుక జీవీ అకాడమీ యాజమాన్యం నాటిన సంస్కార విత్తనాలు స్పష్టంగా కనిపించాయి. చదువుతో పాటు మంచితనం, వినయం, బాధ్యత, సహకారం, ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే మనసు వీటన్నింటినీ విద్యార్థుల్లో నాటుతున్న పాఠశాల యాజమాన్యాన్ని స్థానికులు హృదయపూర్వకంగా అభినందించారు.సేవా పథంలో ఇంత చిన్న వయసులో అడుగులు వేస్తున్న పిల్లలు రేపటి సమాజానికి శాంతి, సేవ, సానుభూతి విలువలను తీసుకెళ్లే వెలుగుబాటలవుతారని అందరూ ఆశిస్తున్నారు.ఆశీర్వాదం అందజేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్