నేషనల్ ఎలక్ట్రిషన్ డే వేడుకలు జెండా ఆవిష్కరించిన కోగంటి
నేషనల్ ఎలక్ట్రిషన్ డే వేడుకలు జెండా ఆవిష్కరించిన కోగంటి
నందిగామ,జనవరి 27(వెలుగునాడు ప్రతినిధి) : కంచికచర్ల వీరులపాడు, మండలాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పంచమర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఏఎంసి చైర్మన్ ల సంఘం ఉపాధ్యక్షుడు,కెసిల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకటసత్యనారాయణ (బాబు) హాజరయ్యి జెండా ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేటు ఎలక్ట్రిషన్లకు ఎప్పుడు అండగా ఉంటుందని అందరికీ ఎలక్ట్రిషన్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచమర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రైవేటు ఎలక్ట్రిషన్ల కష్టాలు సుఖాలు తనకు తెలుసని వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల వీరులపాడు ప్రైవేట్ యూనియన్ అధ్యక్షుడు పంచుమర్తి వెంకటేశ్వరరావు, సెక్రెటరీ నాగమల్లేశ్వరరావు కమిటీ సభ్యులు ప్రైవేట్ ఎలక్ట్రిషన్లు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0