ట్రాపిక్ నిబంధనల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి

Feb 22, 2026 - 00:37
Feb 22, 2026 - 00:38
 0  2
ట్రాపిక్ నిబంధనల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి

ట్రాపిక్ నిబంధనల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి

సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్.సిద్దిపేట,ఫిబ్రవరి 21, (వెలుగు నాడు ప్రతినిధి ) : ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అర్రైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా చేసిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఒక సరికొత్త శ్రీకారానికి పలువురు కంటెంట్ క్రియేటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్రాఫిక్ నిబంధనలపై ఆసక్తికరమైన వీడియోలు రూపొందించారు.దీనికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించి స్థానిక సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు మరియు కంటెంట్ క్రియేటర్స్ సైబర్ నేరాలు, మహిళలపై వేధింపులు, మరియు ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించే విధముగా ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించేలా చిన్న చిన్న వీడియోలు సోషల్ మీడియాలో వీడియోలు రూపొందించాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోరి మరిన్ని డిజిటల్ క్రియేటర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కోరారు. మీరు కూడా ఈ సామాజిక బాధ్యతలోపాలుపంచుకోవాలనుకుంటేసైబర్ క్రైమ్, మహిళల భద్రత, ఈవ్ టీజింగ్, ట్రాఫిక్ నియమాలపై ఒక ఇన్ స్టాగ్రామ్ వీడియో రూపొందించండి.ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో మీ ఖాతాలో అప్‌లోడ్ చేస్తూ @Siddipet_Police_Commissionerate ను ట్యాగ్ చేయండి.మా అధికారిక ఖాతాతో కోలబ్ రిక్వెస్ట్ పంపండి. మెరుగైన, సురక్షితమైన సిద్దిపేట నిర్మాణంలో మీ వంతు సహకారం అందించలని అన్నారు.సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు తమకు ఉన్న ఫాలోయింగ్‌ను బాధ్యతాయుతంగా వాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ కోరారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్