కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు
కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు
జగ్గయ్యపేట మార్చి13 (వెలుగు నాడు ప్రతినిధి) : పెనుగంచిప్రోలు గ్రామంలోని కుమ్మరి బజారులో కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కవయిత్రి మొల్లమాంబ జయంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు.స్థానిక నేతలతో కలిసి మొల్లమాంబ (మొల్ల) విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించిన కవయిత్రి మొల్లమాంబ రచించిన మొల్ల రామాయణం తెలుగు భాషకు గొప్ప ఆభరణమని తెలిపారు.సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా రామాయణాన్ని రచించి సాహిత్య రంగంలో చిరస్థాయిగా నిలిచిన మహనీయురాలని కొనియాడారు.తెలుగు సాహిత్య సంపదను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని,కవయిత్రి మొల్లమాంబ జీవితం నుండి యువత స్ఫూర్తి పొందాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0