ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

Feb 8, 2026 - 02:56
 0  1
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీపెద్దపల్లి,ఫిబ్రవరి 07 (వెలుగు నాడు ప్రతినిధి) : ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.రామగుండం నగరపాలక సంస్థ ఓటర్ జాబితాలో ఓటరుగా నమోదుై మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫిబ్రవరి 7, 8 తేదీలలో అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎన్టీపీసీ–టిటిఎస్ పరిధిలోని ఎంప్లాయ్ డెవలప్‌మెంట్ సెంటర్ మిలీనియం హాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఫిబ్రవరి 7, 8 తేదీలలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ కేంద్రం పని చేస్తుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పొందదలచిన వారు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు పూరించి, ఓటరు గుర్తింపు కార్డు, ఉద్యోగి గుర్తింపు కార్డు, ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వుల ప్రతులను జతపరిచి సమర్పించాలని సూచించారు. అర్హులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్