విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట మార్చి18 (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్‌పేట గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు,తరగతి గదులు, వంటశాల, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. భోజన సమయంలో విద్యార్థులతో కలిసి స్వయంగా భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. భోజనం రుచి, పరిశుభ్రత, పోషక విలువలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం స్కీం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు చదువుపై ఆసక్తి పెంచేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీ సమయంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మెనూ ప్రకారం పోషకాహారం వండి విద్యార్థులకు సమయానికి అందించాలని,వంట సిబ్బందికి,సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.పిల్లల ఆరోగ్యం, చదువు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సక్రమంగా చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ప్రోత్సహించారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0