కేజీబీవీ హాస్టల్‌లో ఎలుకల బెడద 12 మంది విద్యార్థినులకు గాయాలు
కేజీబీవీ హాస్టల్‌లో ఎలుకల బెడద 12 మంది విద్యార్థినులకు గాయాలు
తిరువూరు ఫిబ్రవరి 13 (వెలుగు నాడు ప్రతినిధి) : ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవీ) ప్రభుత్వ వసతి గృహంలో ఎలుకలు విద్యార్థినిలను కరిచిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మొత్తం 12 మంది విద్యార్థినులకు చేతి వేళ్లకు, కాలి వేళ్లకు గాయాలు కావడంతో వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో వైద్య చికిత్స అందించారు.ఘటనపై సమాచారం అందుకున్న తిరువూరు ఆర్డీవో కె. మాధురి వసతి గృహాన్ని, పాఠశాలను పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి హాస్టల్‌లో ఉన్న అధ్వాన్న పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. వసతి గృహంలో పరిశుభ్రత లోపం, ఎలుకల సంచారం ఎక్కువగా ఉండటం వంటి అంశాలపై ఆర్డీవో ఆరా తీశారు.ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ హాస్టల్ నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. విద్యార్థినుల భద్రతపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.ప్రతిపక్షాల ఆగ్రహం నేపథ్యంలో హాస్టల్ యాజమాన్యం తక్షణమే పరిసర ప్రాంతాలను శుభ్రపరచి, ఎలుకల నివారణ చర్యలు చేపట్టినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. విద్యార్థినుల ఆరోగ్య, భద్రతలపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0