శ్రీ తిరుపతమ్మ అమ్మవారి సేవా దళ సభ్యులకు గుర్తింపు

Feb 9, 2026 - 22:00
 0  7
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి సేవా దళ సభ్యులకు గుర్తింపు

శ్రీ తిరుపతమ్మ అమ్మవారి సేవా దళ సభ్యులకు గుర్తింపు కార్డులు

జగ్గయ్యపేట ఫిబ్రవరి 09, (వెలుగు నాడు ప్రతినిధి ) : పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో సేవలో పాల్గొనే సేవాదళ సభ్యులకు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లుగా ఆలయ కార్యనిర్వాహణాధికారి మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయానికి సంబంధించిన వివిధ ప్రదేశములలో సేవ చేయుటకు,హుండీ లెక్కింపులో పాల్గొనుటకు ఆసక్తి గల సేవాదళ సభ్యులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నామని అన్నారు.గుర్తింపు కార్డులు కోరేవారు ఎలాంటి కేసులు లేకుండా సేవా ధృక్పదం కలిగి ఉండాలన్నారు.ఆసక్తి గల భక్తులు ఆలయ తనిఖీ దారులు కృష్ణమోహన్,లక్ష్మినవీన్ కుమార్ లకు ఆధార్ కార్డు జిరాక్స్,పాస్ పోర్ట్ సైజ్ ఫోటో,విద్యార్హతలు ,సేవాదళం గ్రూపు వివరములు,ఫోన్ నెంబర్ తెలియజేయాలని ఈఓ తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్