దివ్యాంగులకు కొత్త పింఛన్ల కోసం వినతి
దివ్యాంగులకు కొత్త పింఛన్ల కోసం వినతి
జగ్గయ్యపేట జనవరి21,(వెలుగు నాటు ప్రతినిధి ) : జగ్గయ్యపేట నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షులు వడ్డెపూడి ఉమామహేశ్వరరావు జగ్గయ్యపేట ఎంపీడీఓ నితిన్ ను బుధవారం కలిసి కొత్త పింఛన్ల గురించి అడిగారు. చాలా మంది దివ్యాంగులు సర్టిఫికెట్ ఉండి పింఛన్ పొందలేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని గవర్నమెంట్ వారు వీలైనంత తొందరగా వారికి పింఛన్ మంజూరు చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు.దివ్యాంగుల విషయంలో అవకాశం ఉన్నంతవరకు సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీడీఓ అన్నారని ఉమామహేశ్వరరావు తెలియజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0