కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ మండలి సమావేశం
కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ మండలి సమావేశం
జగ్గయ్యపేట,మార్చి18, (వెలుగు నాడు ప్రతినిధి ) : గరికపాడులో వున్న డాక్టర్ కె ఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకేకృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ మండలి సమావేశం గరికపాడులో వున్న డాక్టర్ కె ఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) లో బుధవారం 26వ శాస్త్రీయ మండలి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను కొనసాగించాలని, జిల్లాలోని మట్టి సారం మరియు నీటి లభ్యతను బట్టి నూతన వంగడాలను రైతులకు పరిచయం చేయాలని సూచించారు. ప్రతి పరిశోధన రైతుకు ఆర్థికంగా లాభసాటిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ హనుమంతరావు పశుపోషణలో వస్తున్న నూతన సాంకేతికతలపై అవగాహన కల్పిస్తూ, దేశీ గోవులపాల ప్రయోజనాలను తెలిపారు.కేవలం ఆడ దూడలే పుట్టేలా చేసే సాంకేతికతను ఉపయోగించుకోవాలని అన్నారు.ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిణి విజయకుమారి మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూసారం దెబ్బతింటోందని, రైతులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ప్రాంతీయ పరిశోధనా స్థాన సహ సంచాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్ ,కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తలు గత ఏడాది ఫలితాలను, రాబోయే ఏడాది కార్యాచరణను వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రగతిశీల రైతులు చంద్రశేఖర రావు,రామకోటేశ్వర రావు, రవీంద్ర బాబు పాల్గొని, వ్యవసాయ రంగంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లు, క్షేత్రస్థాయి అనుభవాలను రైతులతో పంచుకున్నారు.తమ అమూల్యమైన సూచనలను అందించారు. లో బుధవారం 26వ శాస్త్రీయ మండలి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను కొనసాగించాలని, జిల్లాలోని మట్టి సారం మరియు నీటి లభ్యతను బట్టి నూతన వంగడాలను రైతులకు పరిచయం చేయాలని సూచించారు. ప్రతి పరిశోధన రైతుకు ఆర్థికంగా లాభసాటిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ హనుమంతరావు పశుపోషణలో వస్తున్న నూతన సాంకేతికతలపై అవగాహన కల్పిస్తూ, దేశీ గోవులపాల ప్రయోజనాలను తెలిపారు.కేవలం ఆడ దూడలే పుట్టేలా చేసే సాంకేతికతను ఉపయోగించుకోవాలని అన్నారు.ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిణి విజయకుమారి మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూసారం దెబ్బతింటోందని, రైతులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ప్రాంతీయ పరిశోధనా స్థాన సహ సంచాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్ ,కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తలు గత ఏడాది ఫలితాలను, రాబోయే ఏడాది కార్యాచరణను వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రగతిశీల రైతులు చంద్రశేఖర రావు,రామకోటేశ్వర రావు, రవీంద్ర బాబు పాల్గొని, వ్యవసాయ రంగంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లు, క్షేత్రస్థాయి అనుభవాలను రైతులతో పంచుకున్నారు.తమ అమూల్యమైన సూచనలను అందించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0