సీనియర్ న్యాయవాది పుట్టిన రోజు వేడుకలు
సీనియర్ న్యాయవాది పుట్టిన రోజు వేడుకలు
నందిగామ, జనవరి20.(వెలుగు నాడు ప్రతినిధి) : నందిగామ న్యాయవాదుల ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాది, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మట్ట ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నందిగామ పట్టణంలో న్యాయవాదులు, మట్ట ప్రసాద్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.న్యాయరంగంలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు గుర్తుచేసుకున్నారు. న్యాయవృత్తిలో అంకితభావంతో పని చేసిన మట్ట ప్రసాద్ అనేక మంది యువ న్యాయవాదులకు మార్గదర్శకులుగా నిలిచారని తెలిపారు. సమాజానికి న్యాయం అందించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నందిగామ న్యాయవాద సంఘ సభ్యులు,సీనియర్ న్యాయవాదులు, అభిమానులు పాల్గొని వేడుకను విజయవంతంగా నిర్వహించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0