వేదాద్రిలో సుదర్శన హోమం

May 30, 2026 - 11:49
 0  2
వేదాద్రిలో సుదర్శన హోమం

వేదాద్రిలో సుదర్శన హోమం

జగ్గయ్యపేట,మే 29, (వెలుగు నాడు ప్రతినిధి)  : పావన కృష్ణానది తీరమున ప్రసిద్ద పుణ్య క్షేత్రము వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానములో శ్రీ స్వామి వారి జన్మనక్షత్రం అయిన స్వాతి నక్షత్రం రోజు ప్రతి నెల దేవదాయ ధర్మదాయ శాఖ శాస్త్రోక్తముగా సుదర్శన హోమం నిర్వహిస్తారు.ఈ నెలలో శుక్రవారం స్వాతి నక్షత్రం సందర్భంగా యాగ పండితులతో శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం నిర్వహించారు.దేవస్థానములో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం జరిపించుకోదలచిన భక్తులు వారం రోజులు ముందుగా దేవాలయ కార్యాలయంలో సంప్రదించాలని దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ వెలగపూడి లక్ష్మణఇందిరాదత్తు,కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్