అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు కి వినతి.టి.డి జనార్ధన్.
అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు కి వినతి.టి.డి జనార్ధన్.
జగ్గయ్యపేట, మార్చి 22 (వెలుగు నాడు ప్రతినిధి) : గత రెండు మూడు రోజులుగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మరియు జగ్గయ్యపేట నియోజకవర్గం లో అకాల వర్షాలు వడగళ్ళు, సుడిగాలుల వల్ల మొక్కజొన్న నేలకొరిగి, కల్లాలలో ఆరబెట్టిన మిర్చి తడిసి, కాపు కొచ్చిన మామిడి నేలరాలి, కోతకు వచ్చిన వరి చేలు వడ్లు క్రింద రాలిపోయి, అరటి గెలలతో తోటలు పూర్తిగా ధ్వంసమై నేలకొరిగి, బొప్పాయి కాయలతో చెట్లు విరిగిపోయి న రైతులు ఆరుగాలం కష్టపడి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటకు చేతికి వచ్చే సమయంలో రైతులు దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోతున్నారని, వారిని తక్షణమే ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి తెలియజేసిన మాజీ శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు తొండపు దశరథ జనార్ధన్.ఈ సందర్భంగా చంద్రబాబు వెంటనే సంబంధిత అధికారులను పిలిచి రైతులు నష్టపోయిన ప్రతి పంటను నమోదు చేసి త్వరిత గదిన ప్రభుత్వానికి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించి ఉన్నారని, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేయుచున్నాను.ఇట్లు,తొండపు దశరథ జనార్ధన్. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, జయప్రద ఫౌండేషన్ చైర్మన్.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0