పెనుగొలను లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
పెనుగొలను లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు.
తిరువూరు,మార్చి 16(వెలుగు నాడు ప్రతినిధి) : గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో పలుచోట్ల సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెనుగొలను బస్టాండ్ సెంటర్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పెనుగొలను గ్రంథాలయంలో గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు, 99 వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడి టీచర్ కే .లింగమ్మ ఆధ్వర్యంలో శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు కారణజన్ముడని వక్తలు తెలిపారు .
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0