దేవాదాయశాఖ లో అనర్హులకు అందలం 

May 15, 2026 - 23:21
 0  8

దేవాదాయశాఖ లో అనర్హులకు అందలం 

విజయవాడ,మే 15(వెలుగు నాడు ప్రతినిధి): దేవాదాయశాఖ లో అనర్హులకు అందలం ఏక్కించే సాంప్రదాయం యధావిధిగాకోనసాగుతుంది.దేవాదాయ శాఖలో ఇటీవల జరుగుతున్న కొన్ని నియామకాలు లేదా పదోన్నతులపై వస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అర్హత లేని వారికి పదోన్నతులు వస్తున్నాయనే ఆరో'పణలు బలంగా వినిపిస్తున్నాయి కృష్ణ జిల్లాలో గ్రేడ్ 3 ఈవోల పదోన్నతులు అనేక విమర్శలు వస్తున్నాయి.జూనియర్ అసిస్టెంట్ లకు గ్రేడ్ త్రీ ఈవోలుగా ప్రమోషన్ ఇవ్వవలసిగా ఉండగా సూపర్నడెంట్ లకు కూడ అడ్డగోలుగా గ్రేడ్ త్రీ ఈవోలుగా ప్రమోషన్ ఇచ్చేస్తున్నారనే .కోగంటి రవికుమార్,కె.ఎస్.వి.రాజగోపాల్,పి సత్యనారాయణలకు ప్రమోషన్ రావలసి ఉండగా తెలంగాణకు చెందిన వ్యక్తి తో పాటు మరో ఇద్దరు అనర్హులకు గ్రేడ్ త్రీ ఈవోలు గా ప్రమోషన్లు పొందారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్