గ్రామీణ మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల.

Mar 11, 2026 - 00:04
 0  9
గ్రామీణ మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల.

గ్రామీణ మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల.

సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ.3.2 కోట్లు మంజూరు.

సిద్దిపేట, మార్చ్ 10,(వెలుగు నాడు ప్రతినిధి) : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అధ్వానంగా మారిన రోడ్లు, మురికి కాల్వల సమస్యలను పరిష్కరించేందుకు రూ.3.2 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను చేపట్టనున్నారు. పనులు ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద నిర్వహించనున్నారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ హైమావతి సంబంధిత అధికారులకు పరిపాలన అనుమతులు జారీ చేసి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రహదారులు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారమవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వర్షాకాలంలో రహదారులు బురదమయంగా మారడం, మురికి నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా నిర్మించనున్న సీసీ రహదారులు, డ్రైనేజీలతో గ్రామాల్లో రాకపోకలు సులభతరం కావడంతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపడనుంది.దుబ్బాక మండలంలోని చీకోడు,రఘోత్తంపల్లి, వెంకటగిరితండా, ఆరేపల్లి,పోతారం గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున,మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్, కాసులబాద్ గ్రామాలకు రూ. 10 లక్షలు చొప్పున,భూంపల్లి-అక్బర్పేట మండలం బేగంపేట గ్రామానికి రూ.10 లక్షలు, దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి,మాచిన్ పల్లి గ్రామాలకు 15 లక్షల చొప్పున,తిర్మలాపూర్,శేరిపల్లిబందారం గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున, కోనాపూర్,మల్లేశంపల్లి,అప్పాయిపల్లి,చెట్లనర్సంపల్లి,సూరంపల్లి, పోసాన్ పల్లి గ్రామాలకు రూ.5 లక్షల చొప్పున,తొగుట మండలంలోని తుక్కాపూర్,కాన్గల్,రాంపూర్,తొగుట,లింగాపూర్,ఎల్లారెడ్డిపేట్,లింగంపేట్ గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున,వరదరాజుపల్లి, మాసాన్ పల్లి, చందాపూర్ గ్రామాలకు రూ.5 లక్షల చొప్పున రాయపోల్ మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి రూ. 15 లక్షలు,రామారం,తిమ్మక్ పల్లి,లింగారెడ్డిపల్లి గ్రామాలకు 10 లక్షల చొప్పున సయ్యద్ నగర్,ముంగీస్ పల్లి,గొల్లపల్లి, వీరారెడ్డిపల్లి గ్రామాలకు రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. సందర్భంగా నిధులు మంజూరు చేయించిన దుబ్బాక నియోజకవర్గ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్