శ్రీతిరుతమ్మ అమ్మవారి తిరుగు ప్రయాణం

Jan 29, 2026 - 00:28
 0  19
శ్రీతిరుతమ్మ అమ్మవారి తిరుగు ప్రయాణం

శ్రీతిరుతమ్మ అమ్మవారి తిరుగు ప్రయాణం

జగ్గయ్యపేట జనవరి28, (వెలుగు నాడు ప్రతినిధి ) : శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు జగ్గయ్యపేట పట్టణంలోని రంగుల మండపం వద్ద 25 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించిన రంగుల మహోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, బుధవారం ఉదయం పెనుగంచిప్రోలు గ్రామానికి బయలుదేరారు.తిరుగు పయనం సందర్భంగా గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు సహా దేవతామూర్తుల విగ్రహాలకు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),యువనాయకులు శ్రీరాం చిన్నబాబు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాన్ని శుభారంభం చేశారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా, తెలుగు నాడు, అంగన్వాడి డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్, తుమ్మేపల్లి చిన్న, ఆచంట సతీష్, కాకులపాటి కృష్ణమోహన్, దువ్వల రామకృష్ణ మరియు ఉత్సవ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారికి ,సహదేవతలకు పట్టణంలో అడుగడుగునా నీరాజనాలు పలికారు.అంగరంగ వైభవంగా ఆబాలగోపాలం అమ్మవారి సేవలోతరించారు.కోలాటాలు,బాజాభజంత్రీలతో పల్లకీలను సాగనంపారు.చిల్లకల్లు, భీమవరం,లింగంగూడెం,మీదుగా పెనుగంచిప్రోలు వరకు సాగే 20కిలోమీటర్లకు పైగా సాగే ఈ పల్లకీల యాత్రలో ఆయాగ్రామాల ప్రజలు అమ్మవారికి భక్తి ప్రపత్తులతో స్వాగతం పలుకుతారు.పౌర్ణిమ రోజున శ్రీగోపయ్య తిరుపతమ్మల కళ్యాణ మహోత్సవం జరపడానికి పెనుగంచిప్రోలు సర్వసన్నద్దమవుతోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్