హైవే పై ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
హైవే పై ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
చిల్లకల్లు యస్ఐ సూర్య శ్రీనివాస్
జగ్గయ్యపేట,మార్చి 10, (వెలుగునాడు ప్రతినిధి) : నేషనల్ హైవే 65 పై ద్విచక్ర వాహనాలను నడిపే వారు క్షేమంగా ఇంటికి చేరుకోవటానికి పాటించాల్సిన నియమాల గురించి చిల్లకల్లు యస్ఐ సూర్య శ్రీనివాస్ వాహనదారులకు అవగాహన కల్పించారు.జాతీయ రహదారి ప్రమాదాల నివారణ కోసం జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో సురక్షిత ప్రయాణం గురించి హైవే పై ప్రయాణించే వాహనదారులకు మంగళవారం ఎస్సై సూర్యశ్రీనివాస్ అవగాహన కల్పించారు.ద్విచక్ర వాహనాల పై ప్రయాణించే వారు హెల్మెంట్, కారు నడిపే వారు సీటు బెల్టును తప్పని సరిగా ధరించాలని,వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్,ఇన్సురెన్స్,వాహనాల కాగితాలు ఫోర్స్ లో ఉంచుకోవాలన్నారు.వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని,మితిమీరిన వేగంతో కూడిన ప్రయాణం,త్రిబుల్ రైడింగ్ ప్రమాదాలకు దారి తీస్తుందనిఅన్నారు.ఈ కార్యక్రమంలో చిల్లకల్లు యస్ఐ 2 మణికంఠ,చిల్లకల్లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1