కూటమి నేతలు హిందువులకు క్షమాపణలు చెప్పాలి వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి తన్నీరు
కూటమి నేతలు హిందువులకు క్షమాపణలు చెప్పాలి వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి తన్నీరు
జగ్గయ్యపేట, జనవరి31, ( వెలుగు నాడు ప్రతినిధి) : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు తిరుమలేశునికి,హిందూ సమాజానికి కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని వైసీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంచార్జి తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శనివారం మండలంలోని తిరుమలగిరిలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి పాదాలను నీటితో శుద్ధి చేసి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నేతలు ఆరోపించినట్లుగా స్వామివారి లడ్డులో జంతు కొవ్వు లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసిందన్నారు.కావాలనే తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.స్వామివారి ఆశీస్సులతో సత్యం గెలిచిందని, అసత్య ప్రచారాలు చేసిన వారికి ఇది తగిన గుణపాఠమని ఆయన అన్నారు.కూటమినేతలు హిందువులకు బహిరంగంగా క్షమాపణ చెప్పి తప్పును ఒప్పుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
1
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0