కాలుష్య కారక కర్మాగారలను మూసి వేయండి జేఏసీ నిరసన ప్రదర్శన

Jan 15, 2026 - 07:05
 0  3
కాలుష్య కారక కర్మాగారలను మూసి వేయండి జేఏసీ నిరసన ప్రదర్శన

జగ్గయ్యపేట జనవరి14 (వెలుగు నాడు న్యూస్) :   స్వచ్ఛ జగ్గయ్యపేట కోసం జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడిన 26 సంఘాల ప్రతినిధులు (జేఏసీ), భోగి పండుగ సందర్భంగా, జగ్గయ్యపేట ఎన్టీఆర్ సర్కిల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.జగ్గయ్యపేటను పట్టిపీడిస్తున్న కెమికల్ భూతాన్ని భోగి మంటల్లో వేసి దహనం చేశారు.భోగిమంటల సాక్షిగా కెమికల్ ఫ్యాక్టరీలను తీసివేయాలని,నినాదాలు చేస్తూ భోగి పండుగను జరుపుకున్నారు."స్వచ్ఛ జగ్గయ్యపేట" కోసం, జగ్గయ్యపేట ప్రజల ప్రాణాలు,,ఆరోగ్యం కోసం అధికారులు,పాలకులు పనిచేయాలని పండగ సందర్భంగా ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రెసిడెంట్ ధరణి కోట వెంకటరమణ,సెక్రటరీ మందడపు శ్రీనివాసు,ట్రెజరర్ బొజ్జ రాజేష్.వైస్ ప్రెసిడెంట్స్ చెరుకూరి రమేష్, గద్దె నాని, నర్రా సీతారాములు, మస్తాన్వలి ,గౌరవ సలహాదారులు కనపర్తి ప్రసాద్..వెంకటేశ్వరరావు, కళ్యాణం కోటేశ్వరరావు, గోగుశెట్టి మహేష్, సెక్రటరీలు పుప్పాల శ్రీనివాస్, నరసింహ రావు,ముజీబ్, మీరా, సంకా భాస్కర్ ,వివిధ సంఘాల నుంచి స్టాలిన్, ఆర్టీసీ సంఘం నాయకులు, గోపి, సత్యనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్