పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి 

May 20, 2026 - 11:18
 0  2
పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి 

పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి 

జగ్గయ్యపేట,మే19, (వెలుగు నాడు ప్రతినిధి)  : వత్సవాయి మండల కేంద్రంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41 వర్ధంతి సభ మంగళవారం సీపీఎం మండల కార్యదర్శి బి రాము అధ్యక్షతన జరిగింది. సభలో జిల్లా కార్య వర్గ సభ్యులు ఎన్సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సుందరయ్య కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఆయన జీవితమంతా పేదల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, అణగారిన వర్గాల కోసం అంకితం చేసిన మహోన్నత వ్యక్తి. వ్యక్తిగత ఆస్తులు, అధికారాలు, సుఖసౌకర్యాలు అన్నింటినీ త్యజించి ప్రజల మధ్యే జీవించిన నాయకుడు.తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. జమీందారుల దోపిడీకి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతాంగాన్ని సంఘటితం చేసి పోరాట మార్గంలో నడిపించారు. భూమి దున్నేవారికే భూమి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానేతల్లో సుందరయ్య ఒకరని కొనియాడారు.సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు సిహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ యువత సుందరయ్య జీవితం నుంచి నేర్చుకోవాల్సింది నిజాయితీ, త్యాగం, ప్రజాసేవ. ఆయన లాంటి నాయకులు అరుదుగా జన్మిస్తారు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం రాజకీయాలు చేయాలని ఆయన జీవితం మనకు బోధిస్తుంది. సుందరయ్య ఆశయ సాధన కోసం, సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా, ప్రజల హక్కుల కోసం, రైతు–కార్మిక సంక్షేమం కోసం మనమందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు టి రమేష్ ,కే చిన్నవెంకటేశ్వర్లు, బిల్లా విశ్వనాథం,వై వెంకట రత్నం, జి వెంకటేశ్వర్లు, బి పుల్లయ్య, కిలారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్