అంబరాన్నంటిన 77వ గణతంత్ర వేడుకలు:

Jan 27, 2026 - 05:00
Jan 27, 2026 - 06:46
 0  17
అంబరాన్నంటిన 77వ గణతంత్ర వేడుకలు:

అంబరాన్నంటిన 77వ గణతంత్ర వేడుకలు

జగ్గయ్యపేట,జనవరి 26 (వెలుగు నాడు ప్రతినిధి ) : జగ్గయ్యపేట, దేశవ్యాప్తంగా సాగుతున్న గణతంత్ర ఉత్సవాల్లో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలోని 150 అడుగుల జాతీయ జెండా వద్ద వేడుకలు మిన్నంటాయి. మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మరియు విజయవాడ డిసిపి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులు చేసిన ప్రసంగాలు ప్రజల్లో దేశభక్తిని, స్ఫూర్తిని నింపాయి. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మారుతోందని కొనియాడారు. "1950లో మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున మనం గణతంత్ర దేశంగా మారాము. నాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, నేడు చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతున్నారు. ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతోంది. సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నాం. యువతకు ఉపాధి కల్పనలో మనం చేస్తున్న కృషి త్వరలోనే సత్ఫలితాలను ఇస్తుంది," అని ఆయన ఆకాంక్షించారు.డిసిపి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి గల చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. "బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది, మన దేశానికి మనమే చట్టాలను రూపొందించుకుని అమలు చేసుకుంటున్న గొప్ప సందర్భం ఇది. నేటి గణతంత్ర వేడుకలు కేవలం పండుగ మాత్రమే కాదు, మన హక్కులను గౌరవిస్తూనే బాధ్యతలను విస్మరించకూడదని గుర్తు చేసే సమయం. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి," అని ఆయన సందేశాన్ని ఇచ్చారు.మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో మున్సిపల్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్ రంగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న స్థానిక క్రీడాకారులు వరుణ్ సాత్విక్ మరియు రాజేష్లను ఘనంగా సన్మానించారు. "మన పట్టణ యువకులు క్రీడల్లో రాణించడం గర్వకారణం. ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పట్టణంలోని 150 అడుగుల జెండా వద్ద ఈ వేడుకలు నిర్వహించడం మన జగ్గయ్యపేట ఆత్మగౌరవానికి ప్రతీక," అని ఆయన పేర్కొన్నారుఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తులసి వెంకటకృష్ణారావు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయం మరియు మెప్మా సిబ్బంది, నియోజకవర్గ స్థాయి పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్