కంచి కామకోటి పీఠాధిపతికి ఘన స్వాగతం
కంచి కామకోటి పీఠాధిపతికి ఘన స్వాగతం
జగ్గయ్యపేట మే19, (వెలుగు నాడు ప్రతినిధి) : కంచి కామకోటి పీఠాధిపతులు,జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు మంగళవారం ఉదయం గురుధాం ధర్మక్షేత్రానికి విచ్చేసిన సందర్భంగా గంటేల వెంకట రమణ గురుదంపతుల ఆధ్వర్యంలో ఘన స్వాగత మహోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),సతీమణి అమ్మాజీ, యువ నాయకులు శ్రీరాం చిన్నబాబు, శ్రీరాం కృష్ణ పవన్, శ్రీరాం కృష్ణ సిద్ధార్థ రాయ్ చిల్లకల్లు టోల్‌గేట్ వద్ద మహాస్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలికి అనంతరం గురధామ్ మహా క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0