అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
నందిగామ, మార్చి 17, (వెలుగు నాడు ప్రతినిధి ) : నందిగామ పట్టణం పాత బస్టాండ్ సెంటర్‌లోని బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్‌లో నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి,కౌన్సిలర్లు మరియు మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా మాట్లాడారు.గత సంవత్సరం కాలంలోనే నందిగామ పట్టణంలో సుమారు 114 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా టీడీపీ కౌన్సిల్ కొనసాగి ఉంటే మరింత అభివృద్ధి సాధ్యమయ్యేదని ఆమె అభిప్రాయపడ్డారు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, 2025 ఫిబ్రవరి నుండి 2026 ఫిబ్రవరి వరకు అన్ని వార్డుల్లో చేతి పంపులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా నాలుగు వార్డులకు కొత్త పైప్‌లైన్లు వేసి నీటి సరఫరా మెరుగుపరిచామని చెప్పారు. భవిష్యత్తులో 24 గంటల పాటు నిరంతర నీటి సరఫరా అందించేందుకు నూతన పైప్‌లైన్ ప్రాజెక్టును త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సిఆర్డిఏ మరియు జనరల్ ఫండ్ ద్వారా సుమారు 9 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్‌ను పునరుద్ధరించామని గుర్తుచేశారు. పదవులు ముగిసినా కౌన్సిలర్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆమె పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మళ్లీ కూటమి కౌన్సిల్ బోర్డు ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నందిగామ పట్టణ జనాభా యాభై వేల దాటిన నేపథ్యంలో, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం అదనంగా ఐదు కోట్ల రూపాయలు కేటాయించాలని సంబంధిత మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0