పరిపూర్ణ బాలల ఆశ్రమంలో అన్నదానం
పరిపూర్ణ బాలల ఆశ్రమంలో అన్నదానం
తిరువూరు , మార్చి 08 ,( వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు నియోజకవర్గం, విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నల్లమోతు రష్మిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరువూరు పట్టణంలోని స్థానిక బైపాస్ రోడ్డులో ఉన్న పరిపూర్ణ బాలల ఆశ్రమంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ మహిళలు తమ లక్ష్యాలను సాధిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సమాజంలో బాలికలపై జరుగుతున్న అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని, మహిళలు ప్రతి రంగంలో ముందుకు రావాలని ఆమె సూచించారు. అనంతరం ఆశ్రమంలోని బాలికలందరికీ స్వీట్లు పంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పరిపూర్ణ ఆశ్రమంలోని చిన్నారులు కూడా రష్మికకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమకు అన్నదానం నిర్వహించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రష్మిక తండ్రి, పరిపూర్ణ బాలల ఆశ్రమ నిర్వాహకులు సిరికొండ నాగేశ్వరరావు (అభి), వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0