మత్తు పదార్థాలపై అవగాహన 

Feb 8, 2026 - 02:58
 0  1
మత్తు పదార్థాలపై అవగాహన 

మత్తు పదార్థాలపై అవగాహన 

తిరువూరు ఫిబ్రవరి 07 ( వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు పట్టణంలోని పాత తిరువూరు డిగ్రీ కాలేజ్ సమీపంలో గుట్కా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తిరువూరు పోలీసులు నిర్వహించారు.పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, యువతకు మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలను స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో చూపించే వీడియోలను తెరపై ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఈ వీడియోలు చూసిన పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు మాట్లాడుతూ, మత్తు పదార్థాల బారిన పడితే యువత భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు, ఎలాంటి అలవాట్లకు లోనవుతున్నారు అనే విషయాలను నిరంతరం గమనించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.సబ్ ఇన్స్పెక్టర్ శాతకర్ణి మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు.మహిళా సబ్ ఇన్స్పెక్టర్ గౌరీశ్వరి మాట్లాడుతూ, ఇళ్ల పరిసరాల్లో గానీ, రోడ్లపై గానీ ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ మత్తు పదార్థాల విక్రయానికి పాల్పడుతున్నట్టు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. “మీరు ఒక్క ఫోన్ చేస్తే మేము వెంటనే స్పందిస్తాం” అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ చల్లా రోషయ్యతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు, పోలీసులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్