హెల్మెట్ ఫై వాహనదారులకు అవగాహనా
హెల్మెట్ ఫై వాహనదారులకు అవగాహనా
తిరువూరు, ఫిబ్రవరి 04 (వెలుగు నాడు ప్రతినిధి ) : తిరువూరు పట్టణంలోని మధిర రోడ్ కూడలి వద్ద శనివారం ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిరువూరు మహిళా సబ్ ఇన్స్పెక్టర్ గౌరీశ్వరి స్వయంగా పాల్గొని, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను నిలిపి, వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై గౌరీశ్వరి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా ప్రాణ రక్షణకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యం వల్ల కూడా ప్రాణాపాయం కలగవచ్చని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల్లో అధికంగా తలకు గాయాల వల్ల ప్రాణనష్టం జరుగుతోందని, హెల్మెట్ ధరించడం ద్వారా ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆమె తెలిపారు. యువత, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలను అలుసుగా తీసుకోవద్దని, తల్లిదండ్రుల ప్రాణ విలువ గుర్తుంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది కూడా పాల్గొని, వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై వివరించారు.శిక్షలపై దృష్టి పెట్టకుండా ముందుగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇటువంటి అవగాహన చర్యలు కొనసాగితే రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమం లో ఎస్ ఐ గౌరీశ్వరి, కానిస్టేబుల్ రాంబాబు, మాధవి, రవి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0