కాలుష్య నిర్మూలన ఉద్యమానికి బీజేపీ మద్దతు
కాలుష్య నిర్మూలన ఉద్యమానికి బీజేపీ మద్దతు
జగ్గయ్యపేట ఏప్రిల్ 02 (వెలుగు నాడు ప్రతినిధి) : షేర్ మహమ్మద్‌పేట,జగ్గయ్యపేట పట్టణం,పట్టణ శివారు కాలనీలైన ఇండస్ట్రియల్ ఏరియా, సాయి నగర్, శాంతినగర్ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్య సమస్యపై నిర్వహించిన సంతకాల కార్యక్రమానికి గురువారం జగ్గయ్యపేట బిజెపి మద్దతు తెలిపింది.ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న కాలుష్య సమస్యను గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాలుష్య సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ, సంబంధిత అధికారులను కలిసి శాశ్వత పరిష్కారo చూపించాలని,ప్రజల ఆరోగ్యం కాపాడడం తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యాపంగు రాజా, పట్టణ ప్రధాన కార్యదర్శులు వల్లపునేని గోవిందరావు, కంబాల గోపి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకటేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు కళ్యాణ్, యువ మోర్చా అధ్యక్షులు జొన్నలగడ్డ షణ్ముఖ, సిహెచ్ నరసింహారావు (అశోక్), దంతాల వీరబాబు, పొడింత్రి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0