భక్త మార్కండేయుడు జయంతి ఉత్సవాలు

Jan 21, 2026 - 22:50
 0  2
భక్త మార్కండేయుడు జయంతి ఉత్సవాలు

భక్త మార్కండేయుడు జయంతి ఉత్సవాలు

 గంపలగూడెం,జనవరి 21,(వెలుగు నాడు ప్రతినిధి) : గంపలగూడెం మండలంలోని, పెనుగొలను శివాలయంలో.బుధవారం భక్త మార్కండేయుడు,జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి వివిధ పూలమాలతో, భక్తులు పూజించారు. ఆలయ అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. అచంచలమైన భక్తి , సంపూర్ణ శరణాగతి ద్వారా మరణాన్ని కూడా జయించవచ్చని నిరూపించిన మార్కండేయుడు గొప్ప శివ భక్తుడని ఆలయ నిర్వాహకులు వూటుకూరు నారాయణరావు తెలిపారు. ముందుగా రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం, పార్వతి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు .ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దాములూరు రామలింగేశ్వర శర్మ, సత్యనారాయణ శర్మ, వేద పండితులు శివయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్