భీష్మ ఏకాదశి వేడుకలు

Jan 30, 2026 - 11:10
Jan 30, 2026 - 11:10
 0  8
భీష్మ ఏకాదశి వేడుకలు

భీష్మ ఏకాదశి వేడుకలు

జగ్గయ్యపేట జనవరి29, (వెలుగు నాడు ప్రతినిధి):  ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. దేవస్థానం కమిటీ సభ్యులు చింతా నాగేశ్వరరావు దంపతుల సహకారంతోనిర్వహించారు.స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం పారాయణ, ప్రసాద వితరణ జరిగింది. దేవస్థానం స్థలదాత చౌడవరపు మల్లికార్జున్ రావు, చింతా పాప తదితరులు పాల్గొన్నారు.జగ్గయ్యపేట పట్టణంలోని ఆనంద సాయి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా గురువారం సామూహికంగా భక్తులు భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ నిర్వహించారు.అనంతరం పారాయణంలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాదాన్ని దేవస్థానం ప్రైవేట్ ఇంప్రూవ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్