మండుతున్న కొండలు

May 22, 2026 - 11:52
May 22, 2026 - 11:53
 0  3
మండుతున్న కొండలు

మండుతున్న కొండలు

జగ్గయ్యపేట,మే 21, (వెలుగు నాడు ప్రతినిధి )  : పెనుగంచిప్రోలు మండలం వెల్దుర్తిపాడు,గుమ్మడిదుర్రు గ్రామాల సమీపంలోని కొండల్లో అగ్గి అంటుకొంది.రాజేశ్వరి గట్టు కాలి పోతోంది.దీంతో సమీప గ్రామాల్లోని ప్రజలు భయ బ్రాంతులవుతున్నారు. ఆకాశం నుంచి కురుస్తున్న నిప్పుల వర్షానికి,ఎండవేడికి కొండపై ఉన్న ఎండుగడ్డి, పొదలు వాటంతట అవే అంటుకుని దహనమవుతున్నాయి. వడగాలులు తోడవడంతో క్షణాల వ్యవధిలోనే ఈ అగ్ని కీలలు కొండ నలుమూలలా విస్తరించి అగ్నిపర్వతాన్ని తలపిస్తున్నాయి.ఈ అగ్నిప్రళయం నుంచి కాపాడటానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్