దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి సీఐటీయూ ర్యాలీ

Feb 5, 2026 - 02:35
 0  3
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి సీఐటీయూ ర్యాలీ

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి సీఐటీయూ ర్యాలీ

తిరువూరు ఫిబ్రవరి 04 ( వెలుగు నాడు ప్రతినిధి ) : ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తిరువూరు పట్టణంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు.ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి బి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లు కార్మిక వ్యతిరేకమైనవని, వీటి వల్ల కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని విమర్శించారు. ఉద్యోగ భద్రత, పని గంటలు, వేతనాలు, సంక్షేమ పథకాలను దెబ్బతీసే ఈ లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెకు కార్మికులు, ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. 12వ తేదీన అన్ని రంగాల కార్మికులు పనులను నిలిపివేసి సమ్మెలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని కోరారు.ఈ ర్యాలీలో సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్