సమ్మర్ యాక్షన్ ప్లాన్ 2026 కింద చలివేంద్రం ప్రారంభం
సమ్మర్ యాక్షన్ ప్లాన్ 2026 కింద చలివేంద్రం ప్రారంభం
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సదుపాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
నందిగామ, ఏప్రిల్ 01, (వెలుగు నాడు ప్రతినిధి) : నందిగామ, పురపాలక సంఘం ఆధ్వర్యంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ 2026 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేసవి కాలంలో ఎండల తీవ్రత అధికంగా ఉండే నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చలివేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రయాణికులు, కార్మికులు, సాధారణ ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.పురపాలక సంఘం ద్వారా పట్టణంలోని ముఖ్య ప్రదేశాల్లో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, వార్డు సభ్యులు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0