సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు సచివాలయం ఉద్యోగులంటే చిత్తశుద్ధి లేదు
సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు సచివాలయం ఉద్యోగులంటే చిత్తశుద్ధి లేదు
ఎన్టీఆర్ బ్యూరో ఫిబ్రవరి 12 (వెలుగునాడు ప్రతినిధి) : పరిధిలోని,జగ్గయ్యపేట మండలం, ముక్తేశ్వరపురం గ్రామంలో శివరాత్రి ఉత్సవాలకు మరుగుదొడ్లు దగ్గర సచివాలయ ఉద్యోగుల్ని విధులు నిర్వహించటం దారుణం.ఎంపీడీవో ఇచ్చిన తిరునాళ షెడ్యూల్లో టాయిలెట్స్ దగ్గర మహిళ ఉద్యొగి డ్యూటీ నిర్వహించటం అనేది అమానుష, అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.సర్వేల పేరుతో అధికారుల వేధింపులతో తాళలేక రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు మృతి.వైయస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, ఉద్యోగులపై మోయలేని పని భారం మోపుతూ వేధిస్తున్న కూటమి ప్రభుత్వం గతంలో వాలంటీర్లు చేస్తున్న పనితో పాటు సచివాలయంలో సిబ్బందిని కుదించి అదనపు బాధ్యతలు అప్పగింత.సచివాలయ ఉద్యోగులపై ఇంకెంత కాలం ఈ కక్ష సాధింపులు?.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్న గడుస్తున్నా ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగులకు ఐ ఆర్, డిఏ లు,కొత్త పి ఆర్ సి ఇవ్వకుండా కాలం గడుపుతుంది.పరిపాలనపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్ని రోజులు.జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లను నియమిస్తే అప్పటి చంద్రబాబు వాళ్ళని ఎగతాళి చేసి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు 5000 కాదు 10,000 ఇస్తానని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అనే దుయ్యబట్టారు.సచివాలయం సిబ్బందికి పని భారం ఎక్కువ అవ్వటం వల్ల రాష్ట్రంలో ఉద్యోగులు మానసిక ఒత్తిడితో చనిపోతున్నారు.దయచేసి కూటమి ప్రభుత్వం వారు ఎంపీడీవో అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, సీనియర్ నాయకులు లాహోరి బద్దు నాయక్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుల కేసర లోకేష్, మండల ఉపాధ్యక్షులు బండి రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నాబత్తుల శ్రీనివాసరావు, మండల బీసీ సెల్ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ, 30, 23వార్డ్ ల అధ్యక్షులు మన్నే అప్పారావు, షేక్ హస్సన్ మహమ్మద్, ఆవుల సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0