శివ భక్తులకు అల్పాహారం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
శివ భక్తులకు అల్పాహారం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
మంథని, ఫిబ్రవరి 15 (వెలుగు నాడు ప్రతినిధి) : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గోదావరి నది స్నానాలకు వెళ్లి వచ్చే భక్తులకు మంథని కాంగ్రెస్ నాయకులు అల్పాహారాన్ని అందజేశారు. మంథని బస్ డిపో స్వామి గోదావరికి వెళ్లే రహదారి పక్కన విశాలమైన ప్రదేశంలో టెంట్ వేసి అల్పాహారం తయారుచేసి భక్తులకు అందజేశారు. అల్పాహారాన్ని స్వీకరించిన శివ భక్తులు కాంగ్రెస్ నాయకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఓడ్నాల శ్రీనివాస్, ముసుకుల సహేందర్ రెడ్డి, నూకల కమల్, పెంటరి రాజు, కుర్ర లింగయ్య కాంగ్రెస్ నాయకులు పాపారావు, కిరణ్, ఎరుకల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0